శ్రీకాంత్ అడ్డాల తో నాని

SMTV Desk 2019-05-08 11:30:06  Nani,

నాచురల్ స్టార్ నాని రీసెంట్ గా జెర్సీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో మరోసారి నాని తన నటనా ప్రతిభ ఏంటన్నది చూపించాడు. జెర్సీ రిలీజ్ కు ముందే విక్రం కుమార్ తో గ్యాంగ్ లీడర్ సినిమా స్టార్ట్ చేసిన నాని.. లేటెస్ట్ గా జెర్సీ అలా రిలీజ్ అవడం ఆలస్యం ఇంద్రగంటి మోహనకృష్ణతో వి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నాని నెగటివ్ రోల్ చేస్తున్నాడని తెలిసిందే. ప్రయోగాలు చేయకపోతే కుదరదని భావించాడో ఏమో తనని ఇంట్రడ్యూస్ చేసిన మోహనకృష్ణ మీద పెద్ద బాధ్యత పెట్టాడు నాని.

ఇక వి అలా మొదలైందో లేదో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో అన్నది కూడా నిర్ణయించుకున్నాడు నాని. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో తెలుగులో మళ్లీ మల్టీస్టారర్ ట్రెండ్ మొదలు పెట్టిన క్రేజీ డైరక్టర్ శ్రీకాంత్ అడ్డాలతో నాని సినిమా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎస్.వి.ఎస్.సి తర్వాత మహేష్ లాంటి సూపర్ స్టార్ తో బ్రహ్మోత్సవం తీసి ఫ్లాప్ డైరక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు శ్రీకాంత్ అడ్డాల. ఆ సినిమా తర్వాత కొద్దిపాటి గ్యాప్ తో నాని సినిమా చేసేందుకు ఫిక్స్ అయ్యాడు. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ నిర్మిస్తుందని తెలుస్తుంది. నాని కెరియర్ లో సూపర్ హిట్టైన భలే భలే మగాడివోయ్ సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే వచ్చింది.