నేను శాపం పెడితే భస్మమే

SMTV Desk 2019-05-08 11:24:42  Kapaul, Cm kcr, KTR

తెలంగాణ మాజీ మంత్రి.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ మైండ్ బ్లోయింగ్ హెచ్చరిక చేశారు. ఈ రోజు ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్, కేటీఆర్ లపై తీవ్ర విమర్శలు చేశారు. అదేమంటే... తనతో పెట్టుకుంటే భస్మమేనంటూ పాల్.. కేటీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకల కారణంగా విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారని... 23 కుటుంబాలు వీరి చర్యల కారణంగానే రోడ్డునపడి శోకిస్తున్నాయని మండిపడ్డారు. కేటీఆర్‌కు డబ్బులు ఎక్కువైతే కాంగ్రెస్, కోదండరాంతో పెట్టుకోవాలంతే కానీ ప్రపంచాన్ని జయించిన తనతో పెట్టుకోవద్దని పాల్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

అంతేకాకుండా తానేం మందా కృష్ణమాదిగను కానని.. 2008లో కేసీఆర్ తన వద్దకు వస్తే ఆశీర్వదించానని.. మెదట తెలంగాణకు మద్దతు ఇచ్చి కేసీఆర్‌కు ఫండింగ్ కూడా చేశానని పాల్ స్పష్టం చేశారు. అంతటితో ఆగకుండా కేటీఆర్‌కు పిచ్చి పట్టింది. కేటీఆర్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి. కేటీఆర్‌కు డబ్బు విపరీతం కావడంతో అహంకారం మితిమీరింది. తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలు బాధాకరం. కవిత, కేటీఆర్ ఆత్మహత్య చేసుకుంటే కేసీఆర్ నిద్రపోతారా?. కేటీఆర్ చినజీయర్ స్వామి కాళ్ళు పట్టుకున్నా ఆయన కూడా కాపాడలేడు. కేసీఆర్‌ను పూజారులు కూడా కాపాడలేరు. నేను శాపం పెడితే భస్మమే అంటూ పాల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.