మహిళతో కానిస్టేబుల్ అసభ్య ప్రవర్తన .. కేసు నమోదు

SMTV Desk 2019-05-08 11:22:31  Constable dayanand, police

రోజు రోజుకి మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయ్. ఎన్ని చట్టాలు వచ్చిన తమ కామ కోరిక తీర్చేదాకా వదలడం లేదు .. అయితే ఇదే తీరులో ఓ సంఘటన చోటు చేసుకుంది ... రక్షించాల్సిన ఖాకీనే కీచకుడిగా మారిన వైనమిది. స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ విధులకు వచ్చిన కానిస్టేబుల్ పోకిరిలా మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం రంజిత్ నాయక్ తాండాలో చోటుచేసుకుంది. పోలింగ్ విధులకు వచ్చిన కానిస్టేబుల్ దయానంద్ స్థానిక మహిళతో అసభ్యంగా ప్రవర్తించడంతో అతడి ప్రవర్తనకు వ్యతిరేకంగా తండావాసులు ఆందోళనకు దిగారు. దాంతో దిగొచ్చిన ఇందల్వాయి పోలీసులు బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కానిస్టేబుల్ పై కేసు నమోదు చేశారు. కానిస్టేబుల్ దయానంద్‌పై చర్యలకు అధికారులు ఆదేశించినట్లు సమాచారం.