నిలకడగా ఉన్న ఇంధన ధరలు

SMTV Desk 2019-05-07 15:59:00  Petrol, Deseal, Price, New delhi

దేశీయ మార్కెట్లో ఇంధన ధరలు నిలకడగా ఉంటూ సోమవారం నాటి ధరలే కొనసాగాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోలు ధర రూ.73.00 వద్ద కొనసాగుతుండగా.. డీజిల్ ధర రూ.66.66 వద్ద కొనసాగుతోంది. ఇక వాణిజ్యరాజధాని ముంబయిలో లీటర్ పెట్రోలు ధర రూ.78.59 వద్ద, డీజిల్ ధర 69.81 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోలు ధర రూ.77.43 వద్ద, డీజిల్ ధర రూ.72.46 వద్ద కొనసాగుతున్నాయి. అమరావతిలో పెట్రోలు ధర రూ.77.13 వద్ద, డీజిల్ ధర రూ.71.81 వద్ద కొనసాగుతున్నాయి. విజయవాడలో పెట్రోలు ధర రూ.76.78 వద్ద, డీజిల్ ధర రూ.71.48 వద్ద కొనసాగుతోంది.