ఈ సారి ప్రపంచకప్ ఇంగ్లాండ్ కే: గవాస్కర్

SMTV Desk 2019-05-07 15:57:04  sunil gawaskar, icc world cup trophy, england, india, virat kohli, mahendra singh dhoni

న్యూఢిల్లీ: భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ వరల్డ్ కప్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సారి ప్రపంచ కప్ గెలిచే అవకాశాలు ఎక్కువుగా ఇంగ్లాండ్ కు ఉన్నాయని అన్నారు. గత ప్రపంచకప్‌లో అర్ధంత రంగా ఓటమి చవిచూసిన ఇంగ్లండ్‌ జట్టు ఈసారి సరికొత్తగా రూపాంతరం చెంది టైటిల్‌ వేటలో ముందంజలో ఉందని అన్నాడు. అలాగే సొంత గడ్డపై ఆడడంకూడా వారికి కలిసొచ్చే అంశమని ఇయాన్‌ మోర్గాన్‌ నేతృత్వంలోని ఇంగ్లండ్‌ జట్టులో మేటి ఆటగాళ్లు ఇటీవల పలు టోర్నీలలో సత్తా చాటిన విషయాన్ని మరువరాదన్నాడు. ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకున్న ఇంగ్లండ్‌ మే 30న ఆరంభం కానున్న వన్డే ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను ఢీకొననున్నది. ఈ ఫార్మాట్‌లో ఇంగ్లండ్‌ చైతన్యం పొంది టైటిల్‌ గెలవాలన్న పట్టుదలతో ఉందని గవాస్కర్‌ అన్నాడు. వన్డే క్రికెట్‌లో వారి అవగాహన, ఆట తీరు గణనీయంగా మార్పు చెందిందని, గతంలో జట్టుకు ప్రస్తుత పరిస్థితిలో ఎంతో మార్పు వచ్చిందన్నాడు. వారిలో ఎంతో ఆత్మవిశ్వాసం కనిపిస్తోందని, ఇటీవలి మ్యాచ్‌లలో వారి ఆట తీరు ఎంతో మెరుగైందన్నాడు. గత ఏడాదినుంచి ప్రపంచకప్‌ విజేత ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, శ్రీలంక, భారత్‌లతో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లను సొంతం చేసుకుని ఇంగ్లండ్‌ జట్టు మేటిగా రాణిస్తోందన్నాడు. గత రెండు ప్రపంచకప్‌లలో స్వదేశంలో ఆడిన జట్లు గెలిచిన తీరున ఇంగ్లండ్‌కే కప్‌ గెలిచే అవకాశాలున్నాయన్నాడు.