వైస్ కెప్టెన్ గా క్రిస్ గేల్

SMTV Desk 2019-05-07 15:56:10  Chris Gayle has been named Jason Holders deputy for the World Cup, ICC Cricket World Cup 2019,Cricket World Cup,World Cup 2019

వెస్టిండీస్ సంచలన ఆటగాడు క్రిస్ గేల్ కు ఆ దేశ క్రికెట్ బోర్డు తాజాగా వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. మే 30న ప్రారంభం కానున్న వరల్డ్ కప్ టోర్నీ కోసం ఎంపిక చేసిన జట్టులో వైస్ కెప్టన్ గా గేల్ కు అవకాశమిచ్చింది. మెగా టోర్నీలో విండీస్ సారథిగా ఉన్న యంగ్ ప్లేయర్ జాసన్ హోల్డర్ కు గేల్ అనుభవం పనికి వస్తుందని బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. 39 ఏళ్ల గేల్ ఇప్పటి వరకు 289 వన్డేలాడి 10వేలకు పైగా పరుగులు చేశాడు. అంతేగాక గేల్ కు ఇది ఐదో వరల్డ్ కప్ టోర్నీ. తనకు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడంపై గేల్ ఆనందం వ్యక్తం చేశాడు. ఈ ప్రపంచకప్ మాకు చాలా ముఖ్యమైనదని, విండీస్ అభిమానులు మాపై భారీ అంచనాలు పెట్టుకున్నారన్న గేల్ వాటిని అందుకుంటామని చెప్పారు. ప్రస్తుతం కరేబియన్ జట్టు ఐర్లాండ్, బంగ్లాదేశ్ లతో ట్రై సిరీస్ ఆడుతోంది. ఈ టోర్నీలో విండీస్ కు వైస్ కెప్టెన్ గా వికెట్ కీపర్ షై హోప్ ఉన్నాడు. 50 వన్డేలు మాత్రమే ఆడిన హోప్ కంటే ఎంతో అనుభవం గల గేల్ అయితే జట్టుకు ఉపయోగకరంగా ఉంటుందని విండీస్ బోర్డు గేల్ వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది.