సిడ్నీలో ఆధ్యాత్మిక గురువు ఆనంద్‌ గిరి అరెస్ట్

SMTV Desk 2019-05-07 15:55:16  Yoga guru Swami Anand Giri arrested in Sydney for assaulting two women

సిడ్నీ: ఆధ్యాత్మిక గురువు ఆనంద్‌ గిరిని సిడ్నీ ఒక్సలే పార్కు ప్రాంతంలో ఆస్ట్రేలియా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ఆనంద్‌ గిరి ఆస్ట్రేలియాలో పూజల పేరుతో ఇద్దరు మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డాడు. రూటీహిల్స్ లోని ఓ ఇంట్లో పూజలు చేస్తానంటూ ఇద్దరు మహిళలను బలత్కరించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు.. గురువు ఆనంద్ గిరిని పరామట్టా కోర్టులో ప్రవేశపెట్టగా.. అతనికి బెయిలు నిరాకరించింది ధర్మాసనం. కుంభమేళా సందర్భంగా బాధితులకు పరిచడం అయిన ఆనంద్‌ గిరి.. పూజల పేరుతో ఆస్ట్రేలియా వచ్చినట్టు తెలిపారు పోలీసులు.