అమెరికాలో విదేశీ విద్యనభ్యసిస్తున్న విద్యార్ధులకు ఊరట

SMTV Desk 2019-05-07 13:19:17  america, indian citizens, indian citizens studying in america, U.S. Citizenship and Immigration Services

వాషింగ్టన్‌: అమెరికాలోని విదేశీ విద్యనభ్యసిస్తున్న విద్యార్ధులకు అమెరికా జిల్లా కోర్టు ఊరట నిచ్చింది. ప్రస్తుతం విదేశీ విద్యార్దులపై అమలులో ఉన్న యూఎస్‌సిఐఎస్‌ (అమెరికా పౌరసత్వ, ఇమిగ్రేషన్‌ సంస్థ) ప్రతికూల విధానాన్ని కోర్టు తాత్కాలిక నిషేదాజ్ఞలు జారీ చేసింది. గత ఏడాది ఆగస్టు 9 నుంచి అమలులోకి వచ్చిన యూఎస్‌సిఐఎస్‌ విధానం ప్రకారం అక్రమంగా నివసిస్తున్న విద్యార్దులపై వేటు వేసింది. 180 రోజులు అక్రమంగా నివసించిన వారిపై మూడేళ్లు, ఏడాదికి పైగా నివసించిన వారిపై పదేళ్లు సదరు కుటుంబంపై అమెరికా రాకుండా నిషేధం విధిస్తారు. దీనిపై పలు కాలేజీలు కోర్టును ఆశ్రయించాయి. విద్యార్ధి తెలిసో తెలియకో తన విద్యార్ధిని ఉల్లంఘించినట్లే నని తేలితే..ఆ రోజు నుంచి అతడు లేదా ఆమె అక్రమంగా నివసిస్తున్నట్లు పరిగణిస్తారు. ఈ విధానం విద్యార్ధుల పాలిట శాపంగా మారిందని పలు విద్యా సంస్థలు కోర్టుకు విన్నవించాయి.