మా లవ్ స్టొరీ ఎలా మొదలయ్యిందో.....పిల్లలకి చెబుతా

SMTV Desk 2019-05-07 13:15:13  global star, priyanka chopra, los angeles, nick jonas

గోబల్ స్టార్ ప్రియాంక చోప్రా అమెరికన్‌ గాయకుడు నిక్‌ జొనాస్‌ను ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే. 2017లో అమెరికాలోని లాస్ఏంజెల్స్‌లో జరిగిన ‘మెట్‌ గాలా’ అనే కార్యక్రమంలో ప్రియాంక.. అమెరికన్‌ గాయకుడు నిక్‌ జొనాస్‌ను కలిశారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. రెండేళ్లు డేటింగ్‌ చేసిన అనంతరం పెద్దల సమక్షంలో గతేడాది డిసెంబర్‌లో ఇద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. మరికొద్దిసేపట్లో.. ఈ ఏడాది జరగబోయే ‘మెట్‌ గాలా’ కార్యక్రమం ప్రారంభం కానుంది.

ఈ కార్యక్రమానికి నిక్, ప్రియాంక ఇద్దరు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా రెండేళ్ల క్రితం తాను నిక్‌తో కలిసి కార్యక్రమంలో దిగిన ఫొటోను ప్రియాంక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ఆ ఫొటోపై ‘మా పిల్లలకు ‘మీ తండ్రిని ఎలా కలిశానంటే..’ అన్న కథను తప్పకుండా చెబుతాను’ అని తెలిపారు.