భారత్‌లో పర్యటించనున్న...అమెరికాకు చెందిన 100 కంపెనీలు

SMTV Desk 2019-05-07 13:10:25  america 100 compenys visits india

న్యూఢిల్లీ: అగ్ర రాజ్యం అమెరికా వ్యాపార అవకాశాల కోసం భారత్‌లో పర్యటించనున్నాయి. అమెరికా వాణిజ్య శాఖ వార్షిక ట్రేడ్ మిషన్ ప్రోగ్రామ్‌లో దాదాపు 100కు పైగా కంపెనీలు భారత్‌కు రానున్నాయి. ఈ బృందం న్యూఢిల్లీతో పాటు అహ్మదాబాద్, చెన్నై, కోల్‌కతా, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో పర్యటించనున్నాయి. ఈ సందర్భంగా వీరు ప్రభుత్వ నాయకులు, మార్కెట్ నిపుణులు, వ్యాపార భాగస్వాములను కలుసుకోనున్నారు. భారత్ పర్యటనలో భాగంగా ఈ బృందం ఇక్కడ ఎనిమిది రోజు ఉండనుంది.ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తులు, సేవలను అందించేందుకు గాను అమెరికా వ్యాపార సంస్థలకు అవసరమైన ప్రతి అవకాశాన్ని సద్వినియోగదం చేసుకోవడమే యుఎస్ వాణిజ్య శాఖ లక్షమని అమెరికా వాణిజ్య మంత్రి విల్బర్ రోస్ అన్నారు. ఈ పర్యటనలో భాగంగా భారత్‌లో వాణిజ్య, పరిశ్రమల శాఖమంత్రి సురేష్ ప్రభుతో రోస్ సమావేశం కానున్నారు. మే 6 నుంచి 13 వరకు నిర్వహించే 11వ విండ్స్ బిజినెస్ ఫోరమ్ అండ్ మిషన్‌కు అమెరికా వాణిజ్య శాఖ హాజరవుతోంది. అమెరికా అంబాసిడర్ కెన్నెత్ జస్టర్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత పెరగనున్నాయని అన్నారు. 2018 సంవత్సరంలో భారత్‌కు అమెరికా వస్తు, సేవల ఎగుమతులు 58.9 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.