బీ.ఫార్మసీ, ఎం.ఫార్మసీ, బీఎస్‌సీ, ఎంఎస్‌సీ విద్యార్థులకు సువర్ణావకాశం

SMTV Desk 2019-05-07 13:07:29  Jobs,

రాష్ట్రంలోని ఫార్మా కంపెనీలు ఈనెల 10,11 తేదీలలో హైదరాబాద్‌లో జాబ్ మేళా నిర్వహించనున్నాయి. ఫార్మా రంగంలో ఉత్పత్తి మరియు పరిశోధన విభాగాలలో ఉన్న ఖాళీలను భర్తీ చేయబోతున్నట్లు ఈ మేళా నిర్వహిస్తున్న నిఖిల్ ఫౌండేషన్ సంస్థ ఛైర్మన్ డాక్టర్ చిక్కాల వేణుగోపాల్ రావు తెలిపారు. బీ.ఫార్మసీ, ఎం.ఫార్మసీ, బీఎస్‌సీ, ఎంఎస్‌సీ పూర్తి చేసిన విద్యార్దులు మాత్రమే వీటికి అర్హులని చెప్పారు. ఈ నెల 10,11 తేదీలలో నగరంలో ఎర్రగడ్డ ఈఎస్ఐ ఆసుపత్రి సమీపంలోగల భానూ ఎన్‌క్లేవ్‌లోని 2వ అంతస్థులో నిర్వహిస్తామని తెలిపారు.

ఈ మేళాలో పాల్గొనదలచిన విద్యార్దులు 7396342168 నెంబరుకు ఫోన్ చేసి తమ పేరు, వివరాలు నమోదు చేసుకోవాలసి ఉంటుందని చెప్పారు. అర్హులైన అభ్యర్ధులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, వాటి జిరాక్సు కాపీలు, రెండు పాస్ పోర్ట్ సైజు ఫోటోలు, ఏదైనా గుర్తింపు కార్డులతో మే 10,11 తేదీలలో భానూ ఎన్‌క్లేవ్‌లోని 2వ అంతస్థులో జరిగే ఇంటర్వ్యూలకు హాజరవ్వాలని కోరారు. ఇంటర్వ్యూలో ఎంపికైన అభ్యర్ధులకు వెంటనే ఉద్యోగ నియామకపత్రాలను (అపాయింట్ మెంట్ లెటర్స్) ఇస్తామని డాక్టర్ చిక్కాల వేణుగోపాల్ రావు తెలిపారు.