లాభాల బాట పట్టిన ఎయిర్‌టెల్

SMTV Desk 2019-05-07 12:27:01  airtel, airtel profits

న్యూఢిల్లీ: టెలికామ్ దిగ్గజం ఎయిర్‌టెల్ నాలుగో త్రైమాసికం(జనవరి,మార్చి)లో నికర లాభం రూ.107.2 కోట్లతో 29 శాతం వృద్ధిని సాధించింది. గతేడాది సంస్థ లాభం రూ.83 కోట్లుగా ఉండగా వరుసగా 11 ఏళ్లుగా నష్టాల తర్వాత కంపెనీ తొలిసారిగా త్రైమాసిక లాభాన్ని పెంచుకుంది. ఎయిర్‌టెల్ ఆదాయం రూ.20,602 కోట్లతో ఏకంగా 6.2 శాతం పెరిగింది. ఈమేరకు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ వెల్లడించింది. అయితే 201819 పూర్తి సంవత్సరం నికర లాభం 62.7 శాతం క్షీణించింది. 201718లో రూ.1099 కోట్లతో పోలిస్తే 201819లో నికర లాభం రూ.409 కోట్లు మాత్రమే నమోదైంది. ఇదే విధంగా ఆదాయం కూడా రూ.82,638 కోట్ల నుంచి రూ.80,780 కోట్లతో 2.2 శాతం తగ్గింది. టెలికామ్ రంగంలోకి రిలయన్స్ జియో ప్రవేశంతో ఎయిర్‌టెల్ వంటి కంపెనీలు నష్టాల్లోకి జారుకున్నాయి. అప్పటి నుంచి నష్టాలు నమోదు చేస్తూ వచ్చిన ఎయిర్‌టెల్ మళ్లీ కోలుకుని లాభాల బాట పట్టింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్‌లో ఎయిర్‌టెల్ అర శాతం లాభపడి రూ.333 వద్ద స్థిరపడింది. భారతీ ఎయిర్‌టెల్ రూ.25 వేల కోట్ల రైట్స్ ఇష్యూను మే 17న ముగియనుంది.