కీలక పాత్రలో కీర్తి సురేష్

SMTV Desk 2019-05-07 12:25:08  keerthy suresh, manmadhudu 2, nagarjuna, rakul preet singh

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున-రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘మన్మథుడు2. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఇజ్రాయిల్ లో జరుగుతోంది. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర అప్ డేట్ బయటికి వచ్చింది. ఇందులో కీర్తి సురేష్ గెస్ట్ రోల్ లో మెరబోతున్నట్టు తెలిసింది. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ స్పెషల్ గా కీర్తి సురేష్ కోసం ఓ పాత్రని రాశాడట. అది కీర్తి కూడా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఇజ్రాయిల్ షెడ్యూల్ తర్వాత హైదరాబాద్ లో ప్రారంభం కానున్నషెడ్యూల్ లో నాగ్ కీర్తి సురేశ్ లపై కీలక సన్నివేశాలు చేయబోతున్నట్లు టాక్. ఇప్పటికే ఈ సినిమాలో మరో కీలక పాత్రలో సమంత నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కీర్తి సురేష్ మహేష్ కోనేరు నిర్మిస్తున్న ఒక స్పోర్ట్స్ డ్రామా మూవీలో నటిస్తోంది.