జ్యోతిష్యురాలిపై అత్యాచారం.. వీడియో తీసి బ్లాక్‌మెయిల్ చేసిన బాలీవుడ్ నటుడు

SMTV Desk 2019-05-07 12:23:16  karan oberoi, story teller, bollywood actor, swambhiman

పెళ్లి పేరుతో జ్యోతిష్యురాలిని వంచించిన బాలీవుడ్ టీవీ నటుడు, మోడల్ కరణ్ ఒబెరాయ్‌ను పోలీసులు కటకటాల వెనక్కి పంపారు. ప్రేమ పేరుతో జ్యోతిష్యురాలికి దగ్గరైన కరణ్.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాక, ఈ ఘటనను వీడియో తీశాడు. అనంతరం దానిని చూపించి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడ్డాడు. అడిగినంత డబ్బు ఇవ్వకుంటే దానిని బయటపెడతానని బెదిరించాడు.

దీంతో ఆమె ముంబైలోని ఓషివారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కరణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. కాగా, మహేశ్ భట్ ‘స్వాభిమాన్’తో టీవీ జర్నీ ప్రారంభించిన కరణ్.. సాయా, జస్సి, జైసీ కోయి నహీ, ఇన్‌సైడ్ ఎడ్జ్ తదితర షోలతో పాప్యులర్ అయ్యాడు. ఫ్యాషన్, ఫిట్‌నెస్ మోడల్ అయిన కరణ్ పలు ప్రకటనల్లోనూ నటించాడు. పాప్ బ్యాండ్ ‘బ్యాండ్ ఆఫ్ బాయ్స్‌’లో కరణ్ సభ్యుడు కూడా. కాగా, పోలీసులు నేడు కరణ్‌ను అంధేరీ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.