ఏటీపీ ర్యాంకింగ్స్‌....మూడో స్థానంలో రోజర్‌ ఫెదరర్‌

SMTV Desk 2019-05-07 12:21:35  atp rankings 2019, atp rankings roger federer

సోమవారం ఏటీపీ ర్యాంకింగ్స్‌ ప్రకటించారు. ఈ ర్యాంకింగ్స్ లో జర్మన్ ప్లేయర్ అలెగ్జాండర్ జ్వెరెవ్‌ను వెనక్కినెట్టి స్విస్ టెన్నిస్‌ స్టార్ రోజర్‌ ఫెదరర్‌ మూడో స్థానానికి చేరుకున్నాడు. సెర్బియా స్టార్ ఆటగాడు నోవాక్ జకోవిచ్‌ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్‌ రెండో స్థానంలో ఉన్నాడు. అలెగ్జాండర్ జ్వెరెవ్‌ ఒక స్థానం కోల్పోయి నాలుగో స్థానంలో నిలిచాడు.నోవాక్ జొకోవిక్ విజయవంతంగా 250వ వారం అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇన్ని వారాల పాటు ప్రపంచ నంబర్ వన్ ర్యాంకులో కొనసాగుతున్న ఐదవ ఆటగాడు జొకోవిక్. రోజర్ ఫెదరర్‌, పీట్ సంప్రాస్, ఇవాన్ లెండ్ల్, జిమ్మీ కానర్స్ ల తర్వాత జొకోవిక్ ఈ ఫీట్ అందుకున్నాడు. జకోవిచ్‌, నాదల్‌, ఫెదరర్‌ టాప్ 3లో కొనసాగడం 12 సంవత్సరాల తర్వాత ఇదే తొలిసారి. చివరిసారిగా 2007లో ఈ ముగ్గురు టాప్ 3లో ఉన్నారు.