వైరల్ వీడియో : పవన్ కళ్యాణ్ పాటకి స్టెప్స్ వెసిన 'ది కింగ్స్‌' డ్యాన్స్ గ్రూప్

SMTV Desk 2019-05-07 12:10:00  pawan kalyan,

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నెంబర్ 150లోని సుందరి అనే సాంగ్‌కి ఓ భారత డ్యాన్స్ గ్రూప్ అప్పట్లో పాపులర్ అమెరికన్ షోలో డ్యాన్స్ చేసింది. ఇప్పుడు అతని సోదరుడు పవన్ కళ్యాణ్ చిత్రం సర్ధార్ గబ్బర్ సింగ్‌లోని వాడెవడన్నా వీడవెడన్నా అనే సాంగ్‌కి అంతర్జాతీయ వేదికపై ది కింగ్స్‌ అనే భారత డ్యాన్స్ గ్రూప్ స్టెప్పులు వేసి అందరిని మంత్ర ముగ్దుల్ని చేసింది.ఈ ఆనందాన్ని ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ తన ట్విట్టర్ ద్వారా నెటిజన్స్‌తో షేర్ చేసుకున్నాడు. వివరాలలోకి వెళితే భారత డ్యాన్స్ గ్రూప్ ది కింగ్స్‌ అంతర్జాతీయ రియాలిటీ ఫినాలో షోలో వాడెవడన్నా వీడెవడన్నా అనే పాటకి అదిరిపోయే స్టెప్పులతో అలరించారు. షోకి న్యాయ నిర్ణేతలుగా ఉన్న జెన్సీఫర్‌ లోపేజ్‌, నీ-యో, డెరెక్‌ హూగ్ వారి డ్యాన్స్‌కి ఫిదా అయ్యారు . ఈ డ్యాన్స్ వీడియోను వరల్డ్‌ ఆఫ్‌ డ్యాన్స్‌ తమ ట్విటర్‌ ఖాతాలో కూడా పోస్ట్ చేసింది.