ప్రకృతిని ఉద్దేశించి మాట్లాడిన మోదీ

SMTV Desk 2017-06-03 12:00:56  international ,parise deal amerika, neature, sentpeters,gujarath government

హైదరాబాద్, జూన్ 3 : కర్బన ఉద్గారాల తగ్గింపునకు భారత్ కట్టుబడి ఉందని ప్రధాని మోదీ ప్రకటించారు. పారిస్ ఒప్పందం ప్రకారం పారిస్ నుంచి అమెరిక వైదొలగుతున్నట్లు ట్రంప్ చేసిన ప్రకటనను సమర్దిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా అన్న చర్చల్లోకి వేల్లదల్చుకోలేదని స్పష్టంచేస్తూ తాను భవిష్యత్తు తరాల వైపు ఉంటానని, మానవాళి.. ప్రకృతిని నాశనం చేయరాదని చెప్పారు. సెయింట్‌పీటర్స్‌ బర్గ్‌ అంతర్జాతీయ ఆర్ధిక వేదికను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. "ప్రకృతిని దోచుకోవడం నేరం. అదే అవసరమైనప్పుడు ఉపయోగించుకోవడం మానవుల హక్కు." పారిస్ ఒప్పందం గురించి కాకుండా ... ప్రకృతి స్వచ్చమైన, భూమిని కలిగి ఉండేందుకు హక్కును భవిష్యతు తరాల నుంచి లాక్కునే హక్కు లేదని అభిప్రాయ పడ్డారు. అని ట్రంప్ నిర్ణయం వెలువడానికి ముందే.. మోదీగారు జర్మనీలో గుర్తు చేశారు. వాతావరణ మార్పులపై రోజు ఎదురవుతున్న ప్రశ్నలకు మోదీ సమాధానం ఇస్తూ, "స్వచ్చమైన, భూమిని మనం కొత్త తరానికి నిలబెట్టాలి. అందుకే ఈ అంశంపై భవిష్యత్తు తరలవైపుకే నేను అంటూ స్పష్టంచేశారు. ప్రకృతి దోపిడీ పై మాకు నమ్మకం లేదు. అవసరమైన దానికన్నా మించి ప్రకృతి నుంచి తీసుకునే హక్కు మనకు లేదు." దీంతో పాటు పునరుత్పాదక ఇంధనంలో భారత్ భారీగా పెట్టుబడులు పెడుతోందని మోదీ తెలిపారు. 2022 నాటికి పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా 175 గిగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేయాలన్నది లక్ష్య మని వెల్లడించారు. ఈ లక్ష్యంలో అణు విద్యుత్తు భాగంగా కాదన్నారు. సౌర, పవన, జీవ, ఇంధన వనరుల ద్వారా విద్యుత్ నే లక్ష్యంలో చేర్చినట్లు తెలిపారు. గుజరాత్ ముఖ్య మంత్రిగా భాద్యతలను నిర్వర్తించిన రోజులు గుర్తు చేసుకుంటూ పారిస్ ఒప్పందం గురించి చర్చించాక ముందే గుజరాత్ లో పర్యావరణ పరిరక్షణకు ఒక విభాగాన్ని నెలకొల్పినట్లు తెలిపారు. ప్రపంచంలోనే ఏర్పాటు చేసిన నాలుగో ప్రభుత్వం ఈ విభాగాన్ని గుజరాత్ ప్రభుత్వం అని చెప్పారు.