హలో బ్రదర్స్: రాయుడు, విజయ్‌శంకర్‌

SMTV Desk 2019-05-06 18:34:46  ambati rayudu, vijayashankar, icc world cup 2019

న్యూఢిల్లీ: వరల్డ్ కప్ టీంలో అంబటి రాయుడుని కాదని విజయ్‌శంకర్‌కు ఛాన్సివ్వడంపై అనేక విమర్శలోస్తున్నాయి. విజయ్‌శంకర్‌ సమర్థుడే కాని కేవలం 3 మ్యాచుల్లో రాణించకపోయినంతమాత్రాన రాయుడుని పక్కనపెడతారా అంటూ సెలెక్టర్లను మాజీ ఆటగాళ్లు సైతం ప్రశ్నించారు. వీటిపై చీఫ్ సెలెక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ స్పందిస్తూ...విజయ్‌ త్రీ డైమెన్షనల్‌ ఆటగాడని.. అందుకే రాయుడిని పక్కనపెట్టి అతనికి ఛాన్సిచ్చామని చెప్పగా.. వరల్డ్‌ కప్‌ చూసేందుకు 3డీ గ్లాసెస్‌కు ఆర్డరిచ్చా నంటూ రాయుడు కౌంటర్‌ కూడా ఇచ్చాడు.వరల్డ్‌కప్‌లో శంకర్‌ చోటుదక్కించుకున్నప్పటి నుంచి రాయుడితో పోలిక తేవడం మొదలుపెట్టారు. ఇద్దరిలో ఎవరు మెరుగైన ఆటగాడనే విషయం పక్కనపెడితే.. ఐపీఎల్‌ లీగ్‌ స్టేజ్‌లో ఇద్దరం ఒక్కటే అనేలా ప్రతిభ కనబరిచారు. అంతేకాదు.. ఇద్దరూ చెరో 14 మ్యాచ్‌లు ఆడి సరిగ్గా 219 పరుగులే చేశారు. సగటు కూడా 19.90 సేమ్‌ టూ సేమ్‌! స్ట్రయిక్‌రేట్‌ విషయంలో మాత్రం రాయుడు (90.49)కంటే శంకర్‌ (120.32) కొంత మెరుగ్గా ఉన్నాడు.