ఫోక్స్‌వేగన్‌కు సుప్రీం కోర్టు ఊరట

SMTV Desk 2019-05-06 18:33:00  Volkswagen, supreme court

న్యూఢిల్లీ: జర్మనీ కార్ల తయారీ సంస్థ ఫోక్స్‌వేగన్‌కు సుప్రీం కోర్టు ఊరటనిచ్చింది. గతంలో జాతీయ హరిత ట్రైబ్యూనల్‌ ఫోక్స్‌ వేగన్‌కు రూ.500 కోట్లు జరిమానా విధించి సంగతి తెలిసిందే. డీజిల్‌ ఇంజిన్లలో మోసపూరిత పరికరాలను అమర్చి తక్కువ ఉద్గారాలను చూపినందుకు ఈశిక్షను విధించిది. అంతేకాక రెండు నెలల్లోపు ఈ మొత్తాన్ని డిపాజిట్‌ చేయాలని పేర్కొంది అయితే ఈ జరిమానాపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. ఈరోజు జస్టిస్‌ ఎస్‌.ఎ.బోబ్డే నేతృత్వంలోని బెంచ్‌ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది.