జూలైలో తానా వేడుకలు !

SMTV Desk 2019-05-06 18:31:58  tana celebrations 2019

వాషింగ్టన్‌: జూలై 4, 5, 6 తేదీల్లో తానా 22వ మహాసభలు ఏర్పాటు చేయాలనీ తెలుగు అసోసియేషన్‌ నార్త్‌ అమెరికా ప్రకటించింది. ఈ ఏడాది అమెరికాలోని వాషింగ్టన్‌ డిసిలో సంబురాలు జరుపుకోవాలని తానా అధ్యక్షుడు సతీష్‌ వేమన వెల్లడించారు. అయితే మూడు రోజుల పాటు అట్టహాసంగా జరిగే తానా మహాసభలకు అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌తో పాటు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలుగు రాష్ట్రాల సియంలు చంద్రబాబు. కేసిఆర్‌ను ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు. 2007 తర్వాత మళ్లీ ఈ ఏడాది వాషింగ్టన్‌ డిసిలో తానా సభలు నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు.