'బుర్రకథ' టీజర్ విడుదల...

SMTV Desk 2019-05-06 17:16:32  Burrakath teaser,

సాయి కుమార్ తనయుడిగా ప్రేమకావాలి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆది ఇప్పటికి వరకు సరైన హిట్ కొట్టలేదని చెప్పాలి. ప్రేమకావాలి ఏదో డెబ్యూ మూవీ కాబట్టి ఆడేసింది ఆ తర్వాత లవ్ లీ పర్వాలేదు అనిపించినా ఆది హీరోగా నిలబడే సినిమా పడలేదు. అయినా సరే వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు ఆది సాయి కుమార్. ప్రస్తుతం ఆది హీరోగా డైమండ్ రత్నబాబు డైరెక్ట్ చేసిన సినిమా బుర్రకథ. టైటిల్ వినగానే పాత కాలంలో బుర్రకథ గురించి చెబుతారని అనుకుంటే పొరపాటే.



రెండు బుర్రలున్న హీరో కథ ఈ సినిమా కాన్సెప్ట్. ఈ సినిమాలో అభిరాం గా నటిస్తున్న ఆది రెండు బుర్రలు కలవాడిగా రెండు రకాల పాత్రల్లో కనిపిస్తున్నాడు. ఒక్కడే రెండు వేరియేషన్స్ లో ఒకటి మోడ్రెన్.. రెండోది ఆధ్యాత్మిక భావనతో ఉంటాడన్నమాట. మొత్తానికి ఆది సాయికుమార్ బుర్రకథ వర్క్ అవుట్ అయ్యేలానే ఉంది. సినిమా మొత్తం ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారని టీజర్ చూస్తేనే చెప్పొచ్చు. మిస్తీ చక్రవర్తి హీరోయిన్ గా నటిస్తున్న ఈ బుర్రకథ సినిమాకు సాయి కార్తిక్ మ్యూజిక్ అందిస్తుండగా రాం ప్రసాద్ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు.