ఓటేసిన మహీ

SMTV Desk 2019-05-06 17:14:00  ms dhoni, loksabha elections 2019

రాంచి: నేడు లోక్ సభ ఎన్నికల్లో ఐదవ విడత పోలింగ్ సందర్భంగా ఐపీఎల్‌ టోర్నీలో బిజీబిజీగా ఉన్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ ఓటు హక్కు వినియోగించుకున్నాడు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఝార్ఖండ్‌లోని రాంచీలో గల జవహర్‌ విద్యా మందిర్‌లో తన కుటుంబసభ్యులతో వచ్చి మహీ ఓటు వేశాడు. ధోనీతో పాటు భార్య సాక్షి సింగ్‌, కూతురు జీవా ఉన్నారు. పోలింగ్‌ కేంద్రం ఆవల ధోనీతో ఫొటోలు దిగేందుకు అభిమానులు పోటీపడ్డారు.