ఆప్ లో మరో వికెట్ ఢమాల్ ..

SMTV Desk 2019-05-06 17:12:58  MLA Devender Kumar,

ఆప్ లో మరో వికెట్ పడింది. ఆమ్ ఆద్మీ పార్టీ రెబల్ ఎమ్మెల్యే దేవిందర్ కుమార్ షెరావత్ బీజేపీలో చేరారు.దేవిందర్ కుమార్ షెరావత్ కు కేంద్రమంత్రి విజయ్‌గోయల్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఢిల్లీ బీజేపీ ఇన్‌ఛార్జ్ శ్యాంజాజు, గోయల్ సమక్షంలో మే 3న ఆప్ ఎంఎల్ఎ అనిల్ బాజ్‌పేయ్ బిజెపిలో చేరిన విషయం విదితమే. బీజేపీ రూ.10 కోట్ల చొప్పున ఆఫర్ ప్రకటించి..తమ ఎమ్మెల్యేలను బలవంతంగా పార్టీలోకి తీసుకుంటుందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియో ఇప్పటికే ఆరోపణలు చేశారు.గత లోక్ సభ ఎన్నికల్లో బిజెపి ఢిల్లీలోని ఏడు స్థానాల్లో విజయం సాధించింది. తిరిగి ఈ ఎన్నికల్లో ఈ స్థానాలను నిలబెట్టుకునేందుకు వ్యూహాత్మకంగా సాగుతోంది. ఇదిలా ఉండగా ఢిల్లీలోని ఏడు లోక్ సభ స్థానాలను కైవసం చేసుకుని బిజెపికి గండికొట్టాలన్న ఆలోచనతో ఆప్ అధిష్ఠానం ఉంది. ఈ క్రమంలో ఆప్ నుంచి బిజెపికి వలసలు పెరగడంతో ఆప్ అధిష్ఠానం ఆందోళన చెందుతుంది. ఆప్ నుంచి వలసలు వెళ్లకుండా తగు చర్యలు తీసుకునే పనిలో ఆప్ ఉంది.