రసెల్‌ మీద ఆధార పడటం కూడా పద్ధతి కాదు!

SMTV Desk 2019-05-06 16:42:32  kkr vs mi, ipl 2019, dinesh karthik, andrew russell

ముంబయి: ఐపీఎల్ 2019 సీజన్లో భాగంగా ముంభై లోని వంఖేడ్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌‌ని 9 వికెట్ల తేడాతో ముంబయి ఇండియన్స్ జట్టు చిత్తుగా ఓడించిన సంగతి తెల్సిందే. అయితే కోల్‌కతాను ముంభై ఓడించడంతో హైదరాబాద్‌‌ జట్టు ప్లేఆఫ్స్ కు చేరుకుంది. మ్యాచ్ అనంతరం కోల్‌కతా కాప్టెన్ దినేష్ కార్తిక్ మీడియాతో మాట్లాడుతూ.... రసెల్‌ బ్యాటింగ్‌ చేయడానికి ఎంతో అవకాశం ఉంది. కానీ ప్రతి మ్యాచ్‌ను అతడే గట్టెక్కిస్తాడనుకోవడం బాగోదు. అతడి మీద ఆధార పడటం కూడా పద్ధతి కాదు. ఈ టోర్నమెంట్‌ మొత్తంలో రసెల్‌ ఆట అద్భుతం. ఈ సీజన్‌ మాకు అంత బెస్ట్‌ కాదనుకుంటా. ఐపీఎల్‌ ఒక వినోదాత్మకమైన టోర్నమెంట్‌. ప్రతిరోజు మేం మా సామర్థ్యం మేరకు పనిచేయడానికి ప్రయత్నిస్తాం. అందరి అంచనాలు అందుకోవాలంటే ముందుగా మేం కొన్నింట్లో మెరుగుపడాలి. వచ్చే ఏడాది మరింత బలంతో, ఆత్మవిశ్వాసంతో ఐపీఎల్‌లో అడుగుపెడతాం అని కార్తిక్‌ తెలిపాడు.