రష్యా విమానంలో మంటలు....పిడుగు పడటం వల్లే ప్రమాదం!

SMTV Desk 2019-05-06 16:37:27  Russian plane crash, Russian plane lands in flames in Moscow, Russian plane catches fire in Moscow

మాస్కో: ఆదివారం రష్యాలోని ఓ విమానం టేకాఫ్ తీసుకునే సమయంలో నెలకు బలంగా ఢీకొనడంతో మంటలు చెలరేగి 41 మంది మృత్యువాత పడ్డారు. అయితే ఈ ఘటనపై ఇంతకుముందు వార్తల్లో విమానం టేకాఫ్ అయ్యే సమయంలో ఏర్పడిన సాంకేతిక లోపంతో విమానం నేలకు బలంగా ఢీకొనడంతో మంటలు చెలరేగాయి అని రాశారు. కానీ, విమానం ల్యాండ్‌ అవుతున్న సమయంలో వెనుకభాగంలో పిడుగుపడటంతో మంటలు వ్యాపించాయని నిపుణుల బృందం తేల్చింది. మరణించిన వారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.ఈ ప్రమాదం రాజధాని మాస్కోలోని షెరెమెత్యేవో విమానాశ్రయంలో టేకాఫ్‌ తీసుకున్న సుఖోయి సూపర్‌జెట్ విమానంలో కాసేపటికే సాంకేతిక లోపాన్ని గుర్తించారు. దీంతో విమానాన్ని వెనక్కి రప్పించారు. ఈ క్రమంలో విమానం ల్యాండ్‌ అవుతున్న సమయంలో ప్రమాదానికి గురైంది. వెనుక భాగంలో మంటలు అంటుకున్నాయి. మంటలతోనే విమానం రన్‌వేపై పరుగులు పెట్టింది. ఇటు హుటాహుటిన విమానంలోని అత్యవసర ద్వారాలు తెరుచుకున్నాయి. ఎమర్జెన్సీ ద్వారంగుండా 37 మంది ప్రయాణీకులు బయటపడి తమ ప్రాణాలను కాపాడుకున్నారు.