ఒడిశాలో ప్రధాని ఏరియల్ సర్వే

SMTV Desk 2019-05-06 15:05:41  PM Modi, Naveen patnyak

ఫణి తుఫాను ప్రభావంతో ఒడిశా రాష్ట్రం అతలాకుతలమైన విషయం తెలిసిందే. రాష్ట్రంలో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ఏరియల్ సర్వే చేశారు. ప్రధాని మోడీతో పాటు రాష్ట్ర గవర్నర్ గణేశీలాల్, సిఎం నవీన్ పట్నాయక్, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తదితరులు ఏరియల్ సర్వేలో పాల్గొన్నారు. ఏరియల్ సర్వే అనంతరం మోడీ నవీన్ పట్నాయక్, అధికారులతో ఫణి తుఫానుపై సమీక్ష నిర్వహించారు. ఫణి తుఫాను కారంగా తీవ్రంగా నష్టపోయిన ఒడిశాను అన్ని విధాల ఆదుకుంటామని మోడీ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ముందస్తు సహాయక చర్యల్లో భాగంగా రూ.381 కోట్లను ఆర్థిక సహయం అందించామని, మరో వెయ్యి కోట్ల రూపాయలను త్వరలోనే అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. తుఫాన్ బాధితులకు అన్ని విధాలుగా సహాయం చేయాలని ఆయన సిఎం నవీన్ పట్నాయక్ ను కోరారు.