గోదాంలో భారీ అగ్నిప్రమాదం

SMTV Desk 2019-05-06 13:42:14  Fire accident.

గుంటూరు: పొగాకు గోదాంలో భారీ అగ్నిప్రమాదం సంభవించిన ఘటన గుంటూరు శివారులోని పొత్తూరు సమీపంలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…చేబ్రోలు హనుమయ్య పొగాకు గోదాంలో ప్రమాదవశాత్తు మంటలు లేచాయి. వెంటనే గోదాంలో పనిచేసే కార్మికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం మేరకు 6 అగ్నిమాపక శకటాలతో ఘటనాస్థలికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే మంటలు అదుపులోకి రాకపోవడంతో పక్కన ఉన్న గోదాంలకు మంటలు వ్యాపించకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనలో భారీగా ఆస్తినష్టం జరిగింది.