బాలయ్య అభిమాని అంటే మజాకా .. ఎం చేసాడో మీరు చూడండి

SMTV Desk 2019-05-06 13:41:07  Balayya, balakrishna

సాధారణంగా ఎవరైనా పెళ్లి పత్రికలపై దేవుళ్ళ ఫోటోలు ప్రింట్ వెయిస్తారు. కానీ కర్ణాటకకు చెందిన శ్రీనివాసులు మాత్రం తన అభిమాన నటుడు నందమూరి బాలకృష్ణ ఫోటోను అచ్చు వేయించి తన అభిమానాన్ని ఘనంగా చాటుకున్నాడు. తన కుమారుడి పెళ్లి శుభలేఖపై అభిమాన హీరో ఫొటోను ముద్రించి బాలయ్య అంటే తనకెంత ఇష్టమో నిరూపించాడు.

మే 13న జరగనున్న తన కుమారుడి పెళ్లికి బాలయ్య, నందమూరి అభిమానులు విచ్చేసి వధూవరులను ఆశీర్వదించాలని కోరాడు. వివిధ గెటప్‌లలో ఉన్న బాలకృష్ణ ఫొటోలను శుభలేఖపై ముద్రించాడు. అంతేకాదు, నూతన దంపతులకు బాలయ్యబాబు ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయని ఫొటోల కింద రాయించాడు. ప్రస్తుతం ఈ పెళ్లి శుభలేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీన్ని చుసిన చూసిన బాలయ్య అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు ..