పోలీస్ స్టేషన్ లో బర్త్ డే వేడుక....మండిపడుతున్న అధికారులు, నెటిజన్లు

SMTV Desk 2019-05-06 13:24:25  karimnagar police station, contractor birthday, viral video

కరీంనగర్, మే 06: అన్ని వర్గాల ప్రజల్ని సమానంగా చూడాల్సిన పోలీసులు కొందరు ప్రైవేట్ వ్యక్తులకు గులాంగిరి చేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రైవేట్ వ్యక్తులకు పోలీసులు రహస్యంగా సలాం చేయడం చూసాం. కానీ కరీంనగర్ జిల్లాలోని పోలీస్ స్టేషన్ లో.... ఓ ప్రైవేట్ వ్యక్తికి ఏకంగా పుట్టిన రోజు వేడుకను నిర్వహించారు పోలీసులు. ఓ ప్రైవేట్ వ్యక్తికి పోలీసులు స్వయంగా దగ్గరుండి బర్త్ డే సెలెబ్రేషన్స్ నిర్వహించడం ఇప్పుడు సంచలనంగా మారింది.వివరాల్లోకి వెళితే.....వీణవంక మండలం గంగారం గ్రామానికి చెందిన రవీందర్ రెడ్డికి సీఐ ఇంద్రసేనా రెడ్డి పూలమాల వేసి కేక్ తినిపించారు. నేట్టింట్లో వైరల్ అవుతున్న ఈ వీడియో చిత్రీకరణ మానకొండూరు పోలీస్ స్టేషన్ లో తీసినట్లు సమాచారం.

అంతే కాదు సేల్ఫీ లకు పోజులిస్తూ.... పోలీస్ స్టేషన్ లో నానా హంగామా సృష్టించారు. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వివాదస్పదమవుతుంది. పోలీసుల తీరు పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు...... వెంటనే పోలీసులపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఉన్నాతాధికారులు దీని పై దృష్టి సారించడమే కాకుండా విచారణకు ఆదేశించినట్లు తెలుస్తుంది.