ట్రంప్ ట్వీట్...చైనాపై అధిక సుంకాలు

SMTV Desk 2019-05-06 13:21:41  donald trump, china

వాహింగ్టన్: ఆదివారం రాత్రి అమెరిక అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్ వల్ల ప్రపంచ మార్కెట్లన్నీ అతలాకుతలమయ్యాయి. షేర్లు, చమురు, వివిధ రకాల వస్తువుల ధరలు అమాంతంగా క్షీణించాయి. వాస్తవానికి వచ్చే బుధవారం అమెరికా, చైనా మధ్య వాణిజ్య చర్చలు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే చైనాతో చర్చలు చాలా మందకొడిగా సాగుతున్నాయని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చే శుక్రవారం నుంచి చైనా వస్తువులపై భారీగా సుంకాలు పెంచుతున్నట్లు ట్వీట్ చేశారు. సుమారు 20,000 కోట్ల డాలర్ల విలువైన చైనా వస్తువులపై సుంకాన్ని పది శాతం నుంచి 25 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు. ఆ తరవాత 35,000 కోట్ల డాలర్ల చైనా వస్తువులపై ఏకంగా 25 శాతం సుంకం విధిస్తానని ప్రకటించారు. దీంతో ప్రపంచ మార్కెట్లన్నీ కుప్పకూలాయి.