విమానంలో చెలరేగిన మంటలు....దాదాపు 41 మంది మృతి

SMTV Desk 2019-05-06 12:49:34  Russian plane crash, Russian plane lands in flames in Moscow, Russian plane catches fire in Moscow

మాస్కో: ఆదివారం రష్యాలోని ఓ విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో కూడిన సూపర్‌జెట్ విమానం స్థానిక విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్‌కు దిగినప్పుడు విమానంలో నిప్పు అంటుకోవడంతో తీవ్రస్థాయిలో గందరగోళ పరిస్థితి ఏర్పడిందని రష్యా వార్తాసంస్థ టాస్ తెలిపింది. అయితే ఈ సంఘటనలో దాదాపు 41 మంది మృతి చెందినట్లు సమాచారం. రద్దీగా ఉండే షెరెమెత్యెవో ఎయిర్‌పోర్టు నుంచి విమానం బయలుదేరగానే సాంకేతిక లోపాలు గమనించడంతో సిబ్బంది విపత్తు సంకేతాలు వెలువరించి విమానాన్ని హుటాహుటిన బలవంతంగా కిందికి దింపేందుకు యత్నించారు. ఈ క్రమంలో విమానంలో మంటలు వ్యాపించాయి. పలువురు గాయపడ్డారని తెలిపిన వార్తాసంస్థ ఎంత మందికి ఏ స్థాయిలో గాయాలు అయ్యాయనేది వెల్లడించలేదు. విమానాన్ని కిందికి దింపే తొలి ప్రయత్నం ఫలించలేదని, తరువాతి దశలో విమానం రన్‌వేనుబలంగా తాకిందని వెల్లడైంది. అయితే విమానంలో 150 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారని, మంటలు చెలరేగడంతో ఎందరు మృతి చెందారనేది నిర్థారణ కాలేదని వెల్లడైంది.