ఇదే మీ డెడ్ లైన్: కలెక్టర్ యోగితా రాణా

SMTV Desk 2017-08-23 17:23:00  COLLECTOR YOGITHA RANA, HOSTELS SERVEY

హైదరాబాద్, ఆగస్ట్ 23 : హైదరాబాద్ కలెక్టర్ యోగితా రాణా ప్రభుత్వ అధికారుల పని తీరుపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. సర్వశిక్ష అభియాన్, సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి తదితర అంశాలపై సమీక్ష నిర్వహించగా అందులో కొంత మంది అధికారులు ఇచ్చిన సమాధానాలపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, సంక్షేమ వసతి గృహాలలో ఉన్న విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలను తీసుకోవాలని ఆదేశాలను జారీ చేసారు. ప్రతి హాస్టల్లో విద్యార్థులకు అందిస్తున్న వాటిని తప్పనిసరిగా డిస్ ప్లే చేయాలని తెలిపారు. అసలు ప్రభుత్వ హాస్టల్స్, ప్రైవేటు హాస్టల్స్ భవనాలు ఎన్ని కొనసాగుతున్నాయనే అంశాలపై ఈ నెల 26 వ తేదీన నివేదిక అందించాలని సంక్షేమ అధికారులను ఆదేశించారు. అక్కడ పని చేసే వార్డెన్, వంట మనిషి ఆ హాస్టళ్లలోనే నివసించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి శనివారం పథకాల పురోగతిపై సమీక్షించాలని డీఈవో రమేష్ ను కలెక్టర్ ఆదేశించారు. సంబంధిత వివరాలను వెబ్ సైట్ లో పొందుపరచి, రుణాల మంజూరులో ఎలాంటి అవకతవకలు జరిగిన సీరియస్ యాక్షన్ ఉంటుందని హెచ్చరించారు. అంతేకాకుండా నగరాన్ని గుడుంబా రహిత జిల్లాగా మార్చడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. 1156 మంది గుడుంబా తయారీ దారుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎంత మంది ఉన్నారు? వారికి ఇప్పటి వరకు అందిన సహాయమేంటనే విషయాలపై ఆరా తీయాలని కలెక్టర్ సూచించారు. వారికి ప్రత్యామ్నాయ ఉపాధి పునరావాస పథకాలను వారికి సెప్టెంబర్ 10 వ తేదీలోగా అందించాలని తెలిపారు.