సినిమా తారల విశేషాల గురించి తెలుసుకునేందుకు!!

SMTV Desk 2019-05-06 12:16:48  cinema craze, cinema stars life, vb entertainments

సినిమా తారలకు సంబంధించిన విశేషాలతో కూడిన డైరెక్టరీని వీబీ ఎంటర్‌టైన్‌ మెంట్స్‌ రూపొందించింది. దీనిని బంజారాహిల్స్‌లోని ఎల్వీ ప్రసాద్‌ ల్యాబ్స్‌లో జరిగిన కార్యక్రమంలో మా అసోసియేషన్‌ అధ్యక్షుడు నరేష్‌, ఏపీఎఫ్‌డీసీ అధ్యక్షుడు, నిర్మాత అంబికా కృష్ణ, దర్శకుడు వీరు పోట్ల, ఐజీ కాంతారావు తదితరులు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా అంబికా కృష్ణ మాట్లాడుతూ సినిమా తారల విశేషాల గురించి తెలుసుకునేందుకు చాలా మంది అభిమానులు ఆసక్తి చూపిస్తారన్నారు. ఇలాంటి వారికి వీబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ రూపొందించిన డైరెక్టరీ ఎంతో దోహద పడుతుందన్నారు. సంస్థ అధినేత విష్ణు బొప్పన మాట్లాడుతూ 2014 నుంచి డైరెక్టరీని అచ్చు వేయించడంతో పాటు అవార్డులు అందజేస్తున్నట్టు తెలిపారు.