జర భద్రం గురు : 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం

SMTV Desk 2019-05-06 12:15:10  Temparature, telangana,Andra pradesh

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భానుడి భగభగలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అధిక వేడి ధాటికి ప్రజలు అల్లాడిపోతున్నారు. గతంలో ఎన్నడూ లేనంతంగా సాధారణం కంటే ఐదారు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక, నేడు, రేపు ఉష్ణోగ్రతలు మరింత పెరుగనున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తగిన హెచ్చరికలు జారీ చేశారు.

సోమ, మంగళవారాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. రాబోయే రెండు రోజులు ఉష్ణోగ్రతల్లో అసాధారణ మార్పులు ఉంటాయని, వడగాలులు తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ నుంచి సమాచారం అందింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎండలో బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేసింది. ఈనెల పది వరకు ఎండల తీవ్రత ఇలానే ఉంటుందని తెలిపారు. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్లాలని.. వడదెబ్బకు గురికాకుండా తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.