ప్రియురాలితో కలిసి భార్య హత్యకు పక్కా ప్లాన్

SMTV Desk 2019-05-06 12:13:23  wife murder, husband sketch, delhi crime, lover attack

ప్రియురాలితో రాసలీలు కొనసాగించేందుకు లవర్ తో కలిసి కట్టుకున్న భార్యను హత్య చేశాడు. అనంతరం దానిని ఆత్మహత్యగా చిత్రీకరించాలని ప్లాన్ వేశాడు. తీరా ప్లాన్ బెడసి కొట్టడంతో... పోలీసులకు అడ్డంగా బుక్కయ్యాడు. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...రాహుల్‌ కుమార్‌ మిశ్రా(32) అనే ఇంజనీర్‌ భార్య పూజా రాయ్‌తో కలిసి ఢిల్లీలో నివసిస్తున్నాడు. అతనికి పెళ్లికి ముందే పద్మ అనే మహిళతో సంబంధం ఉంది. ఆమెతో సంబంధాన్ని కొనసాగించడానికి భార్యను అడ్డు తప్పించాలని అనుకున్నాడు. ప్లాన్ ప్రకారం రాహుల్‌ ఇంటికి వచ్చిన పద్మ.. అతడి స్నేహితురాలినంటూ పూజను పరిచయం చేసుకుంది.

బ్రేక్‌ఫాస్ట్‌ చేసిన అనంతరం మాటల్లో పెట్టి.. పూజను కిందపడేసి ఆమె తలను నేలకేసి కొట్టి గొంతు నులిమింది. అనంతరం తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ పూజ పేరిట ఉత్తరం రాసింది. ఇక పూజ హత్య కుట్రలో భాగంగా రాహుల్‌ పనిమనిషికి ముందే సమాచారం ఇవ్వడంతో అతడు కూడా పద్మకు సహకరించాడు. తర్వాత ఆత్యహత్య చేసుకుందని ఆస్పత్రికి తీసుకువెళ్లారు.

ఆమె మృతిపై పూజ తండ్రి అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో... పోలీసులు అనుమానాస్పద హత్యగా కేసును నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులు ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు ప్రారంభించారు.