ఒడిశా తుఫాన్ బాధితుల కోసం రూ. 15 కోట్ల సాయం

SMTV Desk 2019-05-06 12:10:30  Andhra Pradesh, odisha,

ఫణి తుఫాన్‌తో కాకవికలమైన ఒడిశాకు ఆంధ్ర ప్రదేశ్ అండగా నిలిచింది. ఒడిశా తుఫాన్ బాధితుల కోసం రూ. 15 కోట్ల సాయం అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న తెలిపారు. ఫణి తుఫాన్‌తో ఒడిశా కకావికలమైంది.. తుఫాన్ బాధితులను ఆదుకోవడం మానవతా ధర్మమన్నారు. అన్నిరాష్ట్రాలు ఒడిశా తుఫాన్ బాధితులకు అండగా నిలబడాలని చంద్రబాబు సూచించారు. ఒడిశాలో మళ్లీ సాధారణ పరిస్థితులు వచ్చే వరకు అండగా ఉంటామని చంద్రబాబు ట్వీట్ చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే సీఎంఓ అధికారులతో చర్చించారు. అనంతరం ఆర్థికసాయంపై ప్రకటన చేశారు.ఈ సందర్భంగా ఏపీ సీఎస్‌ ఎల్‌వీ సుబ్రమణ్యం మాట్లాడుతూ.. కూలిపోయన చెట్ల తొలగింపునకు 200 పవర్ షా(కటింగ్ రంపాలు) అందించామన్నారు. 12 లక్షల వాటర్ ప్యాకెట్లతో పాటు 20 వాటర్ ట్యాంకర్లతో తాగునీరు పంపిణీ చేశామన్నారు. సోమవారం మరో 20 ట్యాంకర్లతో తాగునీరు అందజేస్తామని తెలిపారు. విద్యుత్ సేవల పునరుద్ధరణకు 1100 మంది విద్యుత్ సిబ్బంది సిద్ధంగా ఉన్నారని, వారిని ఒడిశాకు పంపేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.