మహేష్ అదేం పట్టించుకోకుండా చిరునవ్వు నవ్వారు: మీనాక్షి దీక్షిత్‌

SMTV Desk 2019-05-06 12:04:52  mahesh babu, maharshi, meenakshi deekshith, pooja hegde

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ నటించిన చిత్రం మహర్షి. ఇందులో పూజా హెగ్డే కథానాయిక. ఆమెతో పాటు సినిమాలో మరో గ్లామర్ ఉంది. ఆమె మీనాక్షి దీక్షిత్‌. దూకుడు సినిమాలో మహేష్ తో ఆడిపాడింది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ మహేష్‌తో కలిసి ‘మహర్షి’లో కీలక పాత్ర చేసింది. దీని గురించి మీనాక్షి దీక్షిత్‌ మాట్లాడుతూ మహేష్’తో మళ్లీ కలిసి పనిచేయడం ఒక మంచి అనుభవం.

ఇక, అమెరికాలో ‘మహర్షి’ చిత్రీకరణ జరిగినప్పుడు సెట్‌లోకి వెళ్లిన తొలి రోజే నేను ఏడ్చా. విలువైన వస్తువులతో కూడిన నా బ్యాగ్‌ పోవడమే అందుకు కారణం. ఒక పక్క మహేష్‌బాబుతోపాటు చాలా మంది చిత్రీకరణ కోసం సిద్ధంగా ఉన్నారు. అప్పుడు ఏడుపు ఆగలేదు. దాంతో అందరూ నా బ్యాగ్‌ కోసం వెతకడం మొదలు పెట్టారు. కొద్దిసేపయ్యాక దొరికింది. నా వల్ల ఆలస్యమైనందుకు మహేష్‌కి సారీ చెప్పా. ఆయన అదేం పట్టించుకోకుండా చిరునవ్వు నవ్వారని చెప్పుకొచ్చింది.