వైసీపీ అధినేత జగన్ కు షాకిచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం

SMTV Desk 2017-08-23 16:22:58  Central Election commission, State election commission, YS Jagan, TDP, Nandyala by-polls

న్యూఢిల్లీ, ఆగస్ట్ 23: వైసీపీ అధినేత జగన్‌‌పై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. నంద్య్తాల ఉపఎన్నికల్లో ప్రచారం హోరెత్తిన సంగతి సుపరిచితమే. ఇటు అధికార పక్షం, అటు ప్రతిపక్షాల ప్రచారంతో నంద్యాల రణ భూమిని తలపించింది. అయితే ప్రచార సమయంలో వైసీపీ అధినేత జగన్, ఏపీ ముఖ్యమంత్రిని కాల్చి చంపాలి.. ఉరి తీయాలి.. కాలర్ పట్టుకుని నిలదీయండి అంటూ పలు మార్లు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆగ్రహించిన తెదేపా శ్రేణులు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయగా, కలెక్టర్ నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ ప్రతిపక్షనేత ప్రవర్తనలో మార్పు లేని కారణంగా మరొక మారు నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అయితే వారు పట్టించుకోకపోవడంతో తెదేపా ఎంపీలు రామ్మోహన్‌నాయుడు, నిమ్మల కిష్టప్ప తదితరులు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన సీఈసీ జగన్‌ వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకే వస్తాయని తెలుపుతూ వైసీపీ అధినేత జగన్ పై తక్షణం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఉత్తర్వులు జారీ చేసింది.