హైదరాబాద్ లో లిక్విడ్ గంజాయి ముఠా అరెస్ట్

SMTV Desk 2019-05-06 11:19:00  liquid drugs

హైదరాబాద్: హైదరాబాద్ లో గంజాయిని ద్రవ్యం రూపంలో మార్చి విక్రయిస్తున్న ముఠాను, రూ.20లక్షలు విలువ చేసే సరకును విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఈ లిక్విడ్ గంజాయి రాకెట్ విశాఖపట్నం కేంద్రంగా నడుస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వైజాగ్ నుంచి లిక్వి డ్ గంజాయిని హైదరాబాదుకు తీసుకు వచ్చి, చిన్న చిన్న బాటిళ్లలో నింపి సరఫరా చేస్తున్నారు. బెంగళూరులోని విద్యార్ధులకు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ఉద్యోగులకు గంజాయిని విక్రయిస్తున్నారు. లిక్వి డ్ గంజాయి విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన విజిలెన్స్‌అధికారులు ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈక్రమంలో టీనేజర్లను లక్ష్యంగా చేసుకుని గంజాయి ముఠా గుట్టుగా తమ వ్యాపారాన్ని సాగిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెలుగుచూసింది. బిటెక్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లకు లిక్విడ్ గంజాయిని సరఫరా చేస్తున్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు.