కపట ప్రేమ చూపిస్తూ నాటకాలాడుతున్నారు!

SMTV Desk 2019-05-06 11:16:17  ap cm, pm modi, cm chandrababu

అమరావతి: ఆదివారం అమరావతి ప్రజావేదికలో మీడియా సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశ్నల వర్షం కురిపించారు. రెండు తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత పీఎం లేదా హోం మినిస్టర్ గానీ ఒక్క మీటింగ్ అయినా నిర్వహించారా? మీకు బాధ్యత లేదా? మీకు పరిపాలించే అర్హత ఉందా? అని ప్రశ్నించారు. మోడి మాటల ప్రధానే తప్ప, చేతల ప్రధాని కాదని విమర్శించారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని మోదీకి ఏపీపై ప్రేమ ఎక్కడ ఉంది? కపట ప్రేమ చూపిస్తూ నాటకాలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కించపరిచేలా చౌకబారు మాటలు మాట్లాడుతున్న మోదీ, రాష్ట్ర విభజన గురించి ఇక్కడ కాకుండా, బీహార్ లో ఎందుకు వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.