అక్షయ్ కుమార్ కు కష్టాలను తెచ్చిపెట్టిన పాత వీడియో!

SMTV Desk 2019-05-06 11:14:53  akshay kumar, akshay kumar citizenship, bollywood star hero

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ పౌరసత్వంపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అక్షయ్ కు కెడనా పౌరసత్వం ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని నిన్న కూడా ఆయన ఒప్పుకున్నారు. అయితే, అనవసరంగా ఈ విషయాన్ని రాద్ధాంతం చేస్తున్నారని... గత ఏడేళ్ల కాలంలో తాను కెనడాకు ఒక్కసారి కూడా వెళ్లలేదని చెప్పాడు.

ఈ నేపథ్యంలో, అక్షయ్ కుమార్ కు చెందిన ఒక పాత వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. గత ఏడాదే ఈ వీడియో వెలుగులోకి వచ్చినప్పటికీ... ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.కెనడాలో జరిగిన ఓ ఈవెంట్ లో భారీగా వచ్చిన జనాలను ఉద్దేశించి అక్షయ్ కుమార్ మాట్లాడుతూ, మీ అందరికీ నేను ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతున్నా. నా సొంత ఇల్లు టొరంటో. సినిమాల నుంచి రిటైర్ అయిన తర్వాత మళ్లీ ఇక్కడికే తిరిగి వస్తా. ఇక్కడే ఉండిపోతా అని చెప్పాడు. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.