మోదీ చేసిన వ్యాఖ్యలపై ప్రియాంక గాంధీ స్పందన

SMTV Desk 2019-05-05 18:53:04  modi, rajiv gandhi, priyanka gandhi, congress

మాజీ ప్రధాని, తన తండ్రి రాజీవ్ గాంధీపై మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మండిపడ్డారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. అమరులైన వారి పేర్లు చెప్పుకుని ఓట్లు రాబట్టుకోవాలని మోదీ చూస్తున్నారు కానీ, ఆ అమరులకు మాత్రం గౌరవం ఇవ్వరని విమర్శించారు. రాజీవ్ గాంధీ ఎవరి కోసమైతే తన జీవితాన్ని త్యాగం చేశారో, ఆ అమేథీ ప్రజలే బుద్ధి చెబుతారని, ఇది నిజమని, మోసాన్ని ఈ దేశం ఎప్పుడూ క్షమించదంటూ ఆ ట్వీట్లో మోదీని విమర్శించారు. కాగా, నిన్న యూపీలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో రాజీవ్ గాంధీపై మోదీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజీవ్ గాంధీ నెంబర్ వన్ అవినీతి పరుడని మోదీ ఆరోపించారు.