క్యాట్ వాక్....ర్యాంప్‌పై మోడల్స్ తో నడిచిన క్యాట్

SMTV Desk 2019-05-05 18:05:29  Cat Walks Runway, Morocco

మొరాకో: క్యాట్ వాక్ అంటే ర్యాంప్‌పై మోడల్స్ చేసే వయ్యారపు నడక గుర్తొస్తుంది. కాని మొరాకోలోని మరకేష్ నగరంలో జరిగిన క్రిస్టియన్ డియోర్ క్రూయిజ్‌ షోలో నిర్వహించిన క్యాట్ వాక్ లో అమ్మాయిలతో పాటు ఓ క్యాట్ కూడా నడించింది. దానికి సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మోడల్స్ కొత్త డిజైన్లను ప్రదర్శిస్తూ… ర్యాంప్‌పై క్యాట్ వాక్ చేస్తూ ముందుకెళ్తున్నారు. అదే సమయంలో.. ఓ క్యాట్ ర్యాంప్‌పైకి వచ్చి క్యాట్ వాక్ చేసింది.అంతే…అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారు. ఇది నిజమైన క్యాట్ వాక్ అంటూ ఆ పిల్లిని తమ మొబైల్‌లో వీడియో తీశారు. ఆ క్యాట్ మోడల్స్ పక్క నుంచీ వాక్ చేస్తూ చివరకు ఆడియన్స్ దగ్గరకు వెళ్లింది. దాంతో మోడల్స్, డ్రెస్సెస్ కంటే ఆ పిల్లే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ పిల్లి సరిగ్గా నడవలేదనీ, మోడల్స్‌కి అడ్డుగా వెళ్లిందనీ, దానికి సరైన శిక్షణ ఇవ్వలేదనీ నెటిజన్లు జోక్స్ వేస్తున్నారు.