ఇండియా చరిత్రలో ఓ ముఖ్యమంత్రిపై ఇన్నిసార్లు దాడులు జరగలేదు: కేజ్రీవాల్

SMTV Desk 2019-05-05 18:02:03  delhi cm, kejriwal, aap, aam admi party

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పై నిన్న కిశోర్ అనే యువకుడు దాడిచేసిన సంగతి తెలిసిందే. మోతీనగర్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేజ్రీవాల్ చెంపపై అతను బలంగాకొట్టాడు. ఈ విషయమై కేజ్రీవాల్ ఈరోజు ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. గత ఐదేళ్లలో తనపై 9 సార్లు దాడులు జరిగాయని కేజ్రీవాల్ తెలిపారు.దని వ్యాఖ్యానించారు. భారత్ మొత్తంమీద కేవలం ఢిల్లీ ముఖ్యమంత్రి రక్షణ మాత్రమే బీజేపీ నేతల చేతుల్లో ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు బీజేపీనే ఈ దాడి చేయించిందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఆరోపించారు. కేజ్రీవాల్ ను చంపేయాలనుకుంటున్నారా? అని మండిపడ్డారు.