అక్షయ తృతీయ: ఎస్బీఐ బంపర్ ఆఫర్

SMTV Desk 2019-05-05 17:56:03  sbi

న్యూఢిల్లీ: అక్షయ తృతీయ సందర్భంగా బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎస్బీఐ కార్డు అండ్ పేమెంట్ సర్వీసెస్ (SBICPSL) ప్రకారం రూ.25వేల కనీస కొనుగోలుపై ఎస్బీఐకార్డ్ హోల్డర్స్‌కు 5 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది. ఇది మే 7వ తేదీ వరకు వర్తిస్తుంది. అంటే రూ.2,500 వరకు మీరు క్యాష్ బ్యాక్ పొందవచ్చు. రిలయన్స్ జ్యువెల్లర్స్, జాయ్ అలుక్కాస్, జీఆర్టీ జ్యువెల్లర్స్, కళ్యాణ్ జ్యువెల్లర్స్ తదితర దుకాణాల్లో కొనుగోలు చేస్తే ఈ ఆఫర్ ఉంది. మరిన్ని దుకాణాల్లోను ఈ ఆఫర్స్ ఉన్నాయి. అక్షయ తృతీయ ఆఫర్స్ కోసం ఎంపిక చేసిన దుకాణాల జాబితాను ఎస్బీఐ ఇచ్చింది.ఎంపిక చేసిన దుకాణాల్లో ఆభరణాలు కొనుగోలు చేస్తే, మీరు ఎస్బీఐ కార్డుతో ట్రాన్సాక్షన్ చేస్తే క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఆఫర్ పొందాలనుకుంటే మినిమం ట్రాన్సాక్షన్ రూ.25వేలు తప్పనిసరి. 2019 జూన్ 25వ తేదీ లోపు అకౌంట్‌లో క్యాష్ బ్యాక్ క్రెడిట్ అవుతుంది. ఎస్బీఐ క్రిడెట్ కార్డ్స్ (excluding కార్పోరేట్స్ కార్డ్స్) ద్వారా కొనుగోలు చేయాలి.