రవితేజ కోసం పోటీ పడుతున్న దర్శకులు

SMTV Desk 2019-05-05 17:47:35  ravi teja, disco raja, sampath nandi, raja the great

రవితేజ వరుస పరాజయాలతో సతమతమవుతున్నాడు. ఆయన తాజా చిత్రంగా డిస్కోరాజా రూపొందుతున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్టు ఇబ్బందుల్లో పడినట్టుగా ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు. వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా షూటింగు ఆగిపోయిందని చెప్పుకుంటున్నారు.

దాంతో రవితేజతో తమ ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి కొంతమంది దర్శకులు రంగంలోకి దిగినట్టుగా సమాచారం. ఆ జాబితాలో అజయ్ భూపతి .. గోపీచంద్ మలినేని .. సంపత్ నంది పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. తమ దగ్గరున్న కథలతో రవితేజను ఒప్పించడానికి ఎవరికి వారు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారట. మరి ఈ ముగ్గురు దర్శకులలో రవితేజను ఎవరు ఒప్పిస్తారో .. ఎవరితో కలిసి రవితేజ సెట్స్ పైకి వెళతాడో చూడాలి.