సుకుమార్ తోనే కాదు, రాజమౌళితో కూడా చర్చలు జరుగుతున్నాయి: మహేష్ బాబు

SMTV Desk 2019-05-05 17:45:54  mahesh babu, sukumar, rajamouli, maharshi, pooja hegde

మహేశ్ బాబు కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన మహర్షి సినిమా, ఈ నెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో మహేశ్ బాబు బిజీగా వున్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, సుకుమార్ తో సినిమా పట్టాలెక్కకపోవడం గురించి ప్రస్తావించాడు.

మహర్షి తరువాత కామెడీ ఎంటర్టైనర్ చేయాలని అనుకున్నాను. అయితే సుకుమార్ గారు సీరియస్ గా సాగే ఒక కథను తీసుకొచ్చారు. అందువల్లనే ఆ కథను పక్కన పెట్టేసి, అనిల్ రావిపూడి వినిపించిన వినోదభరితమైన కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను. మార్పు కోసం తను ఈ కథను ఒప్పుకున్నానని చెప్పినప్పుడు సుకుమార్ గారు కూడా ఆనందాన్ని వ్యక్తం చేశారు. భవిష్యత్తులో సుకుమార్ తో తప్పకుండా సినిమా ఉంటుంది. అంతేకాదు రాజమౌళి గారి తోను కథా చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన ప్రకటన వస్తుంది" అని చెప్పుకొచ్చాడు.