మోదీవి అవకాశవాద రాజకీయాలు: చంద్రబాబు

SMTV Desk 2019-05-05 17:31:46  cm chandrababu, pm modi

అమరావతి: భారత ప్రధాని నరేంద్ర మోదీపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మోదీ చౌకబారు రాజకీయాలను చంద్రబాబు విమర్శించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన చంద్రబాబు... ఈ ఐదేళ్ల పాలనలో ప్రధాని మోడీ ఏ ఒక్క అంశాన్నీ పూర్తి చేయలేదన్నారు. ఏపీకి ఇచ్చిన హామీలను విస్మరించి ఎదురుదాడికి దిగుతున్నారని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో మోడీ ఏపీని చులకన చేసి మాట్లాడారన్నారు. మోడీ మాటలకూ, చేతలకూ పొంతనే లేదని విమర్శించారు. ఆయనవన్నీ అవకాశవాద రాజకీయాలని ఫైర్ అయ్యారు.