హెచ్చరికల వల్లే ఫణి ప్రభావం తగ్గింది!

SMTV Desk 2019-05-05 17:06:15  uno, united nation organization, fani tsunami

న్యూయార్క్: తీవ్ర వాయుగుండంగా మారిన ఫణి తుఫాను ప్రభావం తీర రాష్ట్రాలపై తక్కువగా చూపింది. అయితే ముందస్తు హెచ్చరికల వల్లే తుఫాన్‌ ప్రభావం తగ్గించిందని ఐక్యరాజ్య సమితి అభిప్రాయపడింది. భారత ఐఏండీ విభాగం అప్రమత్తతను యూఎన్‌ఓ డిజాస్టర్‌ రిస్క్‌ రిడక్షన్ విభాగం ప్రశంసించింది. జీరో క్యాజువాలిటీ ద్వారా అత్యంత ఖచ్చితత్వాన్ని వాతావరణ శాఖ వాడుకోవడంలో సక్సెస్‌ అయ్యిందని తెలిపింది. వాతావరణ శాఖ ముందస్తు హెచ్చారిక వల్ల 11 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారని ఓడీఆర్‌ఆర్ ప్రకటన విడుదల చేసింది.