రియాన్‌ పరాగ్‌ రికార్డ్

SMTV Desk 2019-05-05 17:00:59  riyan parag, rajasthan royals, ipl 2019

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2019 సీజన్లో భాగంగా శనివారం ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల వేదికగా ఢిల్లీ కాపిటల్స్ తో రాజస్తాన్ రాయల్స్ జట్టు తలపడిన మ్యాచ్ లో ఢిల్లీ జట్టు.. 5 వికెట్ల తేడాతో రాజస్తాన్ పై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో రాజస్థాన్‌ రాయల్స్‌యువ ఆటగాడు రియాన్‌ పరాగ్‌ సరికొత్త రికార్డు సృష్టించాడు. 17 సంవత్సరాల 175 రోజుల్లోనే అర్ధశతకం చేసి ఇంతకుముందు రాజస్థాన్‌ రాయల్స్‌ బ్యాట్స్‌మెన్‌ సంజూ శాంసన్‌ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. పరాగ్‌ 50(49బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులు) పరుగులు చేసి ఐపీఎల్‌లో తన హాఫ్‌ సెంచరీ బాదాడు. పరాగ్‌ రాణించడంతో రాజస్థాన్‌ 115 పరుగులు గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. అయితే ఈ మ్యాచ్‌లో ముగ్గురు బ్యాట్స్‌మెన్‌ మాత్రమే రెండంకెల స్కోరు నమోదు చేశారు. ఈ మ్యాచ్‌లో వెటరన్‌ ఇషాంత్‌శర్మ, అమిత్‌ మిశ్రా రాణించడంతో దిల్లీ క్యాపిటల్స్‌ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో రాజస్థాన్‌ ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది.